రైతులకు నిరంతర విద్యుత్తు ఇస్తాం
23-05-2024 07:20 AM
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
జయశంకర్ భూపాలపల్లి, మే 22 (విజయక్రాంతి): పంటల సాగు కోసం రైతులకు నిరంతర విద్యుత్తు అందిస్తామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నా రు. భూపాలపల్లి నియోజకవర్గం గణపురంలోని 33/11 కేవీ విద్యు తుత ఉపకేంద్రాన్ని ఆయన సంద ర్శించారు. సబ్‌స్టేషన్‌లో ఉన్న లాగ్ బుక్స్‌ను తనిఖీ చేసి ఆపరేటర్లకు పలు సూచనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యుత్తు సరఫరాపై కొంతమంది సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తూ ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారని, ఇది సరికాదని అన్నారు. కరెంటు కోతలు ఎక్కడా లేవని, గత ప్రభుత్వ హయాంలో విద్యుత్తు సంస్థలు నాశనం అయ్యాయని విమర్శిం చారు. అసత్య ప్రచారాలతో ప్రభు త్వానికి చెడ్డపేరు తెచ్చేలా చేస్తే సహిం చేంది లేదని హెచ్చరించారు.






