1 May, 2026 | 2:03 AM

‘నాణ్యతా ప్రమాణాలు గల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తాము’

01-05-2026 12:09 AM

వ్యవసాయ అధికారి శ్రీనివాస్ గౌడ్

ఆమనగల్లు,ఏప్రిల్ 30, (విజయక్రాంతి): మండల వ్యవసాయ అధికారి పి శ్రీనివాస్ గౌడ్ ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ యార్డులో గల వరి కొనుగోలు కేంద్రాన్ని గురువారం పరిశీలించారు. మండలం లో వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్న సమయం లో ప్రస్తుతం మార్కెట్ యార్డ్ కు 400 క్వింటాల్ వరి ధాన్యం చేరుకోవడం అయినది. ఈ రోజు 100 క్వింటాళ్లు కాంటా వేయడం జరిగింది.

ప్రస్తుతం  మార్కెట్ యార్డ్ లో గల వరి ధాన్యం కుప్పలని వ్యవసాయ శాఖ సిబ్బంది ఉదయం 10:00 గంటలకు మరియు సాయంత్రం 3:00  గంటలకు తేమశాతాన్ని, నాణ్యతా ప్రమాణాలు పరిశీలించారు . ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ..రైతులు తమ ధాన్యాన్ని తమ పొలం లో నే ఆరబెట్టుకొని, తూర్పార పట్టుకొని మార్కెట్ యార్డ్ కు తీసుకురావాల్సిందిగా కోరారు.  ధాన్యంలో తాలు ,రాళ్లు లేకుండా 17% తేమశాతం ఉన్నట్లయితే రైతులు రూ.2389/- ఏ గ్రేడ్ కింద పొందవచ్చని రైతులకు సూచించారు. మరియు సన్న రకానికి క్వింటాలు కు రూ.500/- చొప్పున ప్రభుత్వ ప్రోత్సాహకంగా పొందవచన్నారు. వీరితో పాటు ప్రాథమిక వ్యవసాయ సొసైటీ  సీఈఓ పద్మాకర్, సిబ్బంది దేవేందర్, మహేష్, మరియు ఏఈఓ లు నికిత, మీనాక్షి ఉన్నారు.