మహిళా బిల్లును మళ్ళీ ప్రవేశ పెడతాం
- బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్‌కు మహిళలు గుణపాఠం చెప్పాలి
- జిల్లా పర్యటనలో ఎంపీ రఘునందన్ రావు
ఆదిలాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి) : మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించి రాజకీయాల్లో వారి ప్రాధాన్య తను వెంచేందుకు బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుంటే ప్రతిపక్ష కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మహిళ బిల్లును అడ్డుకుని మహిళల అభివృద్ధికి ఆటంకంగా మారారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. జిల్లాలో చేపట్టే మహిళ రిజర్వేషన్ హక్కుల సాధన కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ కు వచ్చిన ఆయన ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి మాట్లాడారు.
త్వరలో మహిళా బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెడతామని వెల్లడించారు. 131వ రాజ్యాంగ సవరణగా తీసుకువచ్చిన మహిళ బిల్లును కాంగ్రెస్ అడ్డుకోవడంతో ఆమోదం పొందాలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రతినిద్యాన్ని పెంచడం ద్వారా సమగ్ర అభివృద్ధి సాధించాలనే ఉద్దేశ్యంతో ఈ బిల్లును కేంద్రం తీసుకువచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెన్ ఈ బిల్లును అడ్డుకుని మహిళల ఆశాలపై నీళ్లు చెల్లిందని విమర్శించారు.
పార్లమెంట్ లో మహిళ బిల్లు ఆవశ్యకతవై ప్రస్తవించకుండా వ్యక్తిగత కుటుంబ విషయాలు మాట్లాడుతూ సమయం వృథా చేశారని రాహుల్ గాంధీవై పరోక్షంగా మండిపడ్డారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు కలిసి మహిళ బిల్లును అడ్డుకుని మహిళలకు చేసిన మోసా న్ని గ్రామగ్రామన చర్చించాల్సి అవసరం ఉందన్నారు. గాంధీ కుటుంబంలోని మహిళలకు మాత్రమే రాజకీయ పదువులుం డాలనే దురుద్దేశ్యంతో ఇతర మహిళలేవరు చట్ట సభలకు రావొద్దనే ఈ బిల్లును కాంగ్రెస్ అడ్డుకుందని ఆరోపించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మహిళలను రాజకీయంగా ఎదగనివ్వాలనే ఉద్దేశ్యంతో మహిళ బిల్లును తీసుకువస్తే కాంగ్రెన్ కావాలనే బిల్లును ఆమెదించకుండా అడ్డుపడిందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి మహిళ కాంగ్రెసకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు ఈ మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముస్తాపురే అశోక్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సుమన్ జాదవ్, నాయకులు ధోని జ్యోతి, చిలుకూరి జ్యోతి రెడ్డి, పవార్ సూచిక, శైలజ, రేణుక, శ్వేత, రజిత, అనిత, తదితరులు పాల్గొన్నారు.






