17 April, 2026 | 2:37 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

చెరువు కట్టపై కంపచెట్లను తొలగిస్తాం

10-04-2025 08:36 PM

మున్సిపల్ కమిషనర్ రమాదేవి..

కోదాడ: కోదాడ చెరువు కట్టపై ఉన్న కంపచెట్లను తొలగించి ఉదయాన్నే వ్యాయామం చేసే వారికి ఇబ్బందులు లేకుండా చూస్తామని కోదాడ మున్సిపల్ కమిషనర్ రమాదేవి తెలిపారు. గురువారం చెరువు కట్టపై కంప చెట్లు మొలిచి ఇబ్బందిగా మారడంతో ఈదుల కృష్ణయ్య, రామినేని శ్రీనివాసరావులు కమిషనర్ రమాదేవి దృష్టికి తీసుకువెళ్లడంతో వెళ్లి పరిశీలించారు. కోదాడ బాయ్స్ హై స్కూల్ నందు విద్యార్థులకు ఉదయం తెల్లవారుజామునే పాఠశాల ప్రారంభిస్తున్నందున వ్యాయామం చేసేందుకు ఎక్కడ కూడా స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వ్యాయామం చేసే వారికి కోదాడ చెరువు కట్ట ఎంతో ఆహ్లాద భరితంగా ఉంటుందని ఉదయాన్నే సూర్యరష్మి తో పాటు చెరువు అందాలకు  వాకింగ్, సైక్లింగ్ చేసే వారికి  ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. కమిషనర్ రమాదేవి వీలైనంత తొందరగా మున్సిపల్ సిబ్బందితో పిచ్చి చెట్లు, కంప చెట్లను తొలగించి చెరువు కట్టను శుభ్రం చేసి ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు.