calender_icon.png 8 May, 2025 | 3:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదర్శ కమ్యూనిస్టు, ప్రజా నాయకుడు మహ్మద్ రజబ్ అలీ

10-04-2025 08:43:15 PM

సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా..

రజబ్ అలీ భవన్లో ఘనంగా రజబ్ అలీ వర్ధంతి..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ఆదర్శ కమ్యూనిస్టు, ప్రజానాయకుడు మహ్మద్ రజబ్ అలీ అని ఆయన సిద్ధాంతాలను సాధించడమే ఆయనకు నిజమైన నివాళి అని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దుర్గరాసి వెంకటేశ్వర్ రావు అన్నారు.  చుంచుపల్లి మండల సిపిఐ కార్యాలయంలో గురువారం మహ్మద్ రజబ్ అలి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. తొలుత రజబ్ అలి చిత్రపఠానికి పూలమాలలు వేసి నివాలులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలోన అయన మాట్లాడుతూ.. రజబ్ అలీ తన కుటుంబం కంటే పోరాటానికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారని తెలిపారు.

సుజాత నగర్ ఎమ్మెల్యేగా సుధీర్గకాలం పనిచేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా హరిజన, గిరిపనులకు అందుబాటులో ఉంటూ వారిలో ఒక వ్యక్తిగా మెలిగిన వ్యక్తి రజబ్ అలీ అని కొనియాడారు. ఆదర్శవంతమైన రాజకీయాలను కొనసాగించిన ఆయన లాంటి వారికి నేటితరం స్పూర్తిగా తీసుకోవాలని ఆకాంక్షించారు. పదవుల కోసం కాకుండా సామాన్యుల కోసం పోరాడిన ప్రజానేత అని పేర్కొన్నారు. రజబ్ అలి ఆశించిన మార్పులుబి సమాజంలో ఇంకా రాలేదని వాటికోసం పోరాడాల్సిన అవసరం కమ్యూనిస్టు కార్యకర్తలపై ఉందన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు వాసిరెడ్డి మురళి, కంచర్ల జమలయ్య, పొలమూరి శ్రీనివాస్, రత్నకుమారి, భూక్యా శ్రీనివాస్, భాగం మహేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.