29-07-2025 12:18:38 AM
కౌశిక్ రెడ్డిపై ఎమ్మెల్యే శంకర్ ఘాటు విమర్శలు
షాద్ నగర్, జులై 28:హుజురాబాద్ ఎ మ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తీవ్రస్థాయిలో మం డిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి పై ఆయన పసలేని విమర్శలు చేస్తున్నారని ఆయన ఆగ్ర హం వ్యక్తం చేశారు. సోమవారం షాద్ నగర్ పట్టణంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరు వీధిరౌడీలా ఉందని, అసభ్య పదజాలంతో సీఎం రేవంత్ రెడ్డిని తూలనాడడం రాజకీ యం కాదని ఆయన హితవు పలికారు.
రా బోయే మూడు నెలల్లోనే నీ రాజకీయ పత నం మరింత దిగజారుతుందని ఎమ్మెల్యే శం కర్ జోస్యం చెప్పారు. ఆయన సీఎం పై చేసి న పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ పరిపక్వతలేదనే తాము భావిస్తున్నామని... ‘ఇది విమ ర్శ కాదు ఇది రౌడీయిజం‘ అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.బీఆర్‌ఎస్ పాలకు లే మత్తు రాజ్యానికి కారణం అని మాజీ సీఎం కేసీఆర్ పాలనలో డ్రగ్స్, గంజాయి, బెల్ట్ షాపులు పెరిగాయని, యువత మత్తుకు బానిసలుగా మారారని ఎమ్మెల్యే ఆరోపించారు.
మీడియా నిష్పక్షపాతంగా నిజాలను ప్రజలకు చూపించాలని ఎమ్మెల్యే సూచించారు. కాంగ్రెస్ పార్టీ వీధి రౌడీల ఊక రింపులకు భయపడదని... అనవసరంగా నో రు జారిన నేతలు కు ప్రజలే ఎన్నికల సమయంలో ప్రజా కోర్టులో శిక్ష వేస్తారు అంటూ బీఆర్‌ఎస్ నేతలపై విమర్శలుగుప్పించారు.