29-07-2025 12:19:09 AM
రూ. 185 కోట్లతో పాల వ్యాపారం, పాడి రైతులకు 15 కోట్ల బోనస్
భీమదేవరపల్లి, జూలై 28 (విజయ క్రాంతి): పాడి పోస్టులతో రైతులు హారతికి అభివృద్ధి చేసుకోవాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి అన్నారు సోమవారం ముల్కనూర్ మహిళా డైరీ 23వ వార్షికోత్సవ మహాసభ జరిగింది .ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ముల్కనూర్ మహిళా డైరీ ఈ సంవత్సరం 185 కోట్లు వ్యాపారం చేసి 15 కోట్లు లాభాలు సాధించింది అన్నారు.
డైరీ సంపాదించిన లాభాలను డైరీ పరిధిలోని 23,000 మంది పాడి రైతులకు అందించడం జరుగుతుందన్నారు. డైరీ పరిధిలోని 23 పాడి రైతులకు గడచిన 23 సంవత్సరాలలో 120 కోట్లు బోనస్ రూపంలో రైతులకు అందించడం జరిగిందన్నారు.
డైరీ జనరల్ మేనేజర్ మార్పాటి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ డైరీ ఏర్పాటు అయినప్పటి నుండి నేటి వరకు సుమారు ఒక్కొక్క గ్రామానికి 60 లక్షలకు పైగా పాడి రైతులకు అందించినట్లు పేర్కొన్నారు. వార్షిక మహాసభలో అత్యుత్తమంగా పాల సేకరణ చేసిన సంఘాలకు బహుమతులు అందించారు. వార్షిక మాసభలో 23 గ్రామాలకు చెందిన అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.