calender_icon.png 20 November, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికలు ఆపకుంటే అగ్గిపుట్టిస్తాం

20-11-2025 01:06:27 AM

  1. బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాల్సిందే
  2. బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, రాంచందర్‌రావులపై ఆ పార్టీలోని బీసీలు తిరగబడాలి
  3. బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్
  4. బీసీలను నమ్మించి నిండా ముంచారు
  5. మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి

ముషీరాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం పెంచిన 42 శాతం బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, అప్పటివరకు సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలిసి బీసీ రిజర్వేషన్లపై ఒత్తిడి పెంచా లని, డిసెంబరు మొదటి వారం నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాలను వేదికగా చేసుకుని కేంద్రంపై పోరాటం చేయాలని బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు.

సర్పంచ్ ఎన్నికలు ఆపకుంటే రాష్ట్రంలో అగ్గిపుట్టిస్తామని హెచ్చరించారు. బుధవారం  హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీసీ జేఏసి అధ్యర్వంలో మెరు పు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ కులగణన జరిగి ఎవరి వాటా వారికి దక్కాలన్న మాటలు తెలంగాణలో ఆచరించడం లేదన్నారు.

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్‌రావు బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించే బాధ్యత ఉన్నప్పటికీ వాటిని పూర్తిగా విస్మరించారని, రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేయడం సిగ్గుచేటన్నా రు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పార్టీ పరంగా బీసీలకు 42 శాతం ఇస్తామని ప్రకటించడాన్ని బీసీ సమాజం వ్యతిరేకిస్తుందన్నారు. రాజ్యాంగాన్ని సవరించి బీసీ రిజర్వేషన్లు పెంచే వరకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు.

మాజీ స్పీకర్, బీఆర్‌ఎస్ శాసనమండలి పార్టీ ఫ్లోర్ లీడర్ సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఎవరి వాటా వారికి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నప్పటికీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు లోపాయీకరంగా బీసీ రిజర్వేషన్లను ఆట కెక్కించి బీసీలను పచ్చి మోసం చేశాయని దుయ్యబట్టారు. పార్టీ పరంగా ఇస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసం ప్రశ్నించారు.

ఈ ఆందో ళన కార్యక్రమంలో బీసీ జేఏసీ చీప్ కో- ఆర్డినేటర్ గుజ్జ కృష్ణ, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, బీసీ జేఏసీ కో-ఆర్డినేటర్ కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజు, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యాంకుర్మా పాల్గొన్నారు.