20-11-2025 01:08:02 AM
జిల్లా సంక్షేమ అధికారి తుల రవి.
ములుగు,నవంబరు19(విజయక్రాంతి): అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం 2025ను పురస్కరించుకొని ‘వయోవృద్ధు లు స్థానిక మరియు ప్రపంచ చర్యను నడిపిస్తున్నారు మా ఆశయాలు,మా శ్రేయస్సు మ రియు మా హక్కులు‘ అనే థీమ్ తో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వారోత్స వాలు నిర్వహించడం జరుగుతున్నది. ఈ వారోత్సవాల్లో భాగంగా మహిళలు, పిల్లలు, దివ్యాంగులు,వయోవృద్ధులు మరియు ట్రా న్స్జెండర్ల సంక్షేమ శాఖ ములుగు ఆధ్వర్యం లో జిల్లా కేంద్రంలో ఏరియా ఆస్పత్రి నుండి కలెక్టరేట్ వరకు వయోవృద్ధుల హక్కులు, సంక్షేమంపై అవగా ర్యాలీని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా సంక్షేమ అధికారి తుల రవి పచ్చ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించ డం జరిగింది. అనంతరం జిల్లాలోని వివిధ ప్రాంతాలనుండి విచ్చేసిన వయోవృద్ధులు,వివిధ సమన్వయ శాఖల సిబ్బంది ర్యాలీ పూర్తిచేసిన అనంతరం కలెక్టరేట్ ముం దు మానవహారం ఏర్పాటుచేసి అంతా వ యోవృద్ధుల సంక్షేమానికి కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయడం జరిగింది.
అనంతరం సంక్షేమాధికారి కార్యాలయం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా సంక్షేమ అధికారి తుల రవి మాట్లాడుతూ వయోవృద్ధులే మనదేశానికి వెలకట్టలేని సంపద అని,వారే మన భవిష్యత్తుకు బలమైన పునాది అని, అలాంటి వారిని బలహీనులుగా చూడకుండావారి హక్కులను ప్రతీ ఒక్కరు గౌరవిం చాలి అని అన్నారు.
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్న కాలంలో పెద్దలు అంటే సమాజంలో ఎంతో గౌరవం ఉండేదని,ప్రస్తుతం నేటి ఉరుకుల పరుగుల సమాజంలో వయో వృద్ధులు వృద్ధాశ్రమాల్లో ఉండే పరిస్థితి రావడం బాధాకరం అని అన్నారు.