05-12-2025 11:06:05 PM
అవినీతి మరకలు అంటని ఆదర్శప్రాయుడు ఏకగ్రీవంగా ఎన్నిక
సామాన్యుడి నుంచి సర్పంచు వైపు ప్రయాణం
ధన బలం, మంద బలం కాదు జనమే ఆయన బలం
కన్నాయిగూడెం,(విజయక్రాంతి): రాజకీయాల్లో పదవులు శాశ్వతం కావు పదవులు ఎన్నివచ్చినా ఎంత సంపాదించామన్న దానికంటే ప్రజల నాడిని అర్థం చేసుకుని వారి కోసం నిస్వార్థంగా పనిచేసి వారి హృదయాల్లో స్థానం సంపాదించగలగడం నిజమైన నాయకుడి గొప్పతనం. ఈ సత్యాన్ని తన జీవన ప్రయాణంతో నిరూపించిన వ్యక్తిత్వం తిప్పనపల్లి లక్ష్మయ్యదే.
కన్నాయిగూడెం మండలంలోని ముప్పనపల్లి గ్రామ పంచాయతీ ప్రజలు సర్పంచును 6వ సారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈసారి ముప్పనపల్లి గ్రామంలో విఓఏగా పనిచేసి గ్రామ ప్రజలకు మంచి సేవ చేసి మహిళలకు మంచి గౌరవం ఇచ్చి మంచిని ప్రజల అపార విశ్వాసాన్ని పొందిన తిప్పనపల్లి లక్ష్మయ్యను ముప్పనపల్లి ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బాధ్యత వస్తే హంగులు కాదు పనికే ప్రాధాన్యం అనే ధోరణి ఆయనలో ఎప్పటికీ మారలేదు. అవినీతి దరిచేరనీయకుండా,అభివృద్ధి ముందుండేలా తీసుకున్న నిర్ణయాలు ఆయన ప్రజా జీవితానికి గుర్తింపు ఉంది.
ఏలాంటి అహంకారానికి చోటివ్వని అయిన ఏలాంటి పదవి లేని రోజుల్లో కూడా ప్రజల మధ్యే తిరిగి వారి మంచి చెడులను తెలుసుకునేవారు. "నోరే నా పెట్టుబడి",“ప్రజల ప్రేమే నా సంపద”అని నమ్మిన తిప్పనపల్లి లక్ష్మయ్య ప్రజా నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం లక్ష్మయ్య సర్పంచు ప్రయాణం మొదలైంది ఈసందర్భంగా ముప్పనపల్లి గ్రామ సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైన తిప్పనపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ ముప్పనపల్లి గ్రామంలోని సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ముప్పనపల్లి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు నేను ముప్పనపల్లి గ్రామానికి చేసే అభివృద్ధి,నా నైతికత,నిజాయితీ,సేవ ఇప్పటికీ ప్రజల హృదయాల్లో చిరస్థానంగా నిలిచేలా ప్రజాసేవ చేస్తాను.
ప్రజాస్వామ్య విలువల ప్రాధాన్యం
గ్రామ పంచాయతీ వంటి స్థానిక సంస్థలు ప్రజా పాలనకు అత్యంత సమీప స్థాయి. ఇక్కడ తీసుకునే నిర్ణయాలు నేరుగా గ్రామ అభివృద్ధిపై ప్రభావం చూపుతాను. అందువల్ల పారదర్శకత,బాధ్యతాయుత వైఖరి,ప్రజా ప్రయోజనాన్ని ముందుంచే నిర్వహణ ఇవి గ్రామాల పురోగతికి పునాది స్తంభాలు. జనవైఖరి,సేవా దృక్పథం,నీతి,నిజాయితీ,బాధ్యత ఈ విలువలను ప్రతిబింబించే నాయకత్వం ఉన్నచోట అభివృద్ధి సహజంగానే ముందడుగు వేస్తుంది. ప్రజల భాగస్వామ్యంతో నడిచే స్వచ్ఛమైన పాలన ప్రజాస్వామ్యాన్ని బలపరచే మార్గం కూడా ఇదే అవుతుంది.