6 May, 2026 | 3:13 AM

వివాదాస్పద భూముల్లో త్వరలో జెండాలు పాతుతం

06-05-2026 01:47 AM

రూ.1.29 కోట్ల నిధులు గ్రామానికి కేటాయింపు

ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి

రాజాపూర్, మే 5 : ప్రజలు భూములు దోచుకుని దాచుకునే నాయకులు కావాలా లేక అభివృద్ధి చేసే నాయకులు కావాలా ఆలోచించుకోవాలని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని కుచర్కల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సుజయ్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో గ్రామ మాజీ సర్పంచ్ యాదగిరి టిఆర్‌ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు నగేష్ 50 మంది టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి  సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఎమ్మెల్యే వారికి కాంగ్రెస్ పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కుచర్కల్ గ్రామంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన రూ. 1.29 కోట్లు మంజూరు చేసినట్లు గుర్తుచేశారు. అవసరమైనన్ని ఇందిరమ్మ ఇండ్లు అందించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసి వైస్ చైర్మన్ యాదయ్య,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శేఖర్ గౌడ్,గోవర్ధన్ రెడ్డి,సత్యం,శ్యాంసుందర్రెడ్డి,రమణ,రమేష్,యాదగిరి,మల్లేష్, నాగేష్,వెంకటయ్య, రమేష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, గోపినాథ్,తదితరులు పాల్గొన్నారు.