కోయ గట్టు పాఠశాలకు శాశ్వత భవన నిర్మాణం చేపడతాం
అసిస్టెంట్ కలెక్టర్(ట్రైనీ) సౌరబ్ శర్మ..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కోయగట్టులో మంజూరైన కొత్త పాఠశాలకు శాశ్వత భవన నిర్మాణాన్ని చేపడుతామని ట్రైని అసిస్టెంట్ కలెక్టర్ సౌరబ్ శర్మ అన్నారు. శనివారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, కోయగట్టును ఆయన సందర్శించారు. ప్రస్తుతం తాత్కాలికంగా నిర్వహిస్తున్న పాఠశాలను పరిశీలించి, ఆ పాఠశాలలో విద్యార్థుల యొక్క అభ్యసన సామర్ధ్యాలు పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. విద్యార్థులకు కావలసిన అన్ని సదుపాయాలు కల్పిస్తామని ఈ సందర్భంగా గ్రామస్థులకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీరామ్మూర్తి, కోఆర్డినేటర్లు ఎన్ సతీష్ కుమార్, ఎస్ కే సైదులు కాంప్లెక్స్ సిఆర్పి శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.




