ఘట్ కేసర్ లో బీసీ బంద్ ప్రశాంతం
ఘట్ కేసర్ (విజయక్రాంతి): ఘట్ కేసర్ మున్సిపల్ లో బీసీ బంద్ ప్రశాంతంగా జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త బంద్ సందర్భంగా ఘట్ కేసర్ మున్సిపల్ లో మండల బీసీ సంఘం అధ్యక్షులు మేడబోయిన సంజీవ ముదిరాజ్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన అఖిలపక్ష నాయకులు బంద్ లో పాల్గొని వ్యాపార, వాణిజ్య సముదాయాలు, పాఠశాలలు, అత్యవసర సేవలు అయిన వైద్యశాలలు, మెడికల్ షాపులు మినహా అన్ని సంపూర్ణంగా బంద్ చేయించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్, బిజెపి మున్సిపల్ అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి, టిడిపి మండల అధ్యక్షులు వేముల సంజీవ గౌడ్, టీజెఎస్ పార్టీ అధ్యక్షులు మారం లక్ష్మారెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పలుగుల మాధవ రెడ్డి, సహకార బ్యాంక్ మాజీ చైర్మన్ లు సార శ్రీనివాస్ గౌడ్, డొంకెని బిక్షపతి గౌడ్, బీసీ సంఘం నాయకులు కురపాల విజయకుమార్ ముదిరాజ్, సహకార బ్యాంక్ డైరెక్టర్ రేసు లక్ష్మారెడ్డి, మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమేష్, మాజీ కౌన్సిలర్ లు బండారి ఆంజనేయులు గౌడ్, షేక్ జహంగీర్, బిఆర్ఎస్ బీసీ సెల్ అధ్యక్షులు సార మురళి గౌడ్, వరికుప్పల లింగస్వామి, బొక్క విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ ఎంపిటిసి మేకల నర్సింగ్ రావు, దీకొండ రఘు, మాజీ సర్పంచ్ లు వెంకటేష్ గౌడ్, శివశంకర్, నాయకులు బొక్క కృష్ణారెడ్డి, రామోజీ, కరుణాకర్, ఎండి నజీర్ రాజాచారి, రొడ్డ యాదగిరి, పొట్ల చెరువు శరత్, ఎండి సిరాజ్ పాల్గొన్నారు.




