21 July, 2026 | 12:34 PM

టీఆర్‌టీ కమ్యూనిటీ హాల్ ప్రజల అవసరాలకే ఉపయోగిస్తాం

21-07-2026 12:40 AM
  1. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హామీ
  2. బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ వినయ్ కుమార్

ముషీరాబాద్, జూలై 20 (విజయక్రాం తి): టిఆర్ టి కమ్యూనిటీ హాల్ కేవలం ప్రజల అవసరాలకు మాత్రమే ఉపయోగిస్తామని జీహెచ్‌ఎంసి  కమిషనర్ ఆర్ వీ కర్ణన్ హామీ ఇచ్చారని బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కు మార్ తెలిపారు. కొన్ని రోజులుగా టిఆర్టి కమ్యూనిటీ హాల్‌ను ప్రజలకు కాకుండా, వేరొక శాఖకు అప్పగిస్తున్నమనే విషయంపై స్థానికులు, అన్ని పార్టీల నాయకులతో కలిసి ఇటీవల గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ కమ్యూనిటీ హాల్ వద్ద నిరసన తెలిపినట్లు ఆయన తెలిపారు.

అనంతరం కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, రాజ్యసభ ఎంపి డాక్టర్ లక్ష్మణ్ లు సమస్యపై జిహెచ్‌ఎంసి  కమిషనర్ ఆర్ వి. కర్ణన్ తో ఫోన్లో సమీక్షించి, ప్రజల అవసరాల కోసం ప్రభుత్వం నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను వారికి కాకుండా ఇతర శాఖలకు  కేటాయించడాన్ని ఖండిస్తూ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని తిరస్కరించి వెనక్కి తీసుకోవాలని సూచించినట్లు కమిషనర్ తెలిపినట్లు ఆయన వెల్లడించారు.

వెంటనే సంబంధిత జోనల్ కమిషనర్  ఇతర అధికారులకు, టిఆర్‌టి కమ్యూనిటీ హాల్ ను ఎదావిధిగా స్థానిక పెద ప్రజల అవసరాలకు, శుభకార్యాలకు ఉపయోగించేందుకు ఆదేశాలు ఇచ్చారని ఆయన తెలిపారు. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ చొరవతో సమస్య పరిష్కారం అవడంతో స్థానిక ప్రజలు, పలు పార్టీల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షుడు వి.నవీన్ కుమార్, రత్నసాయి చంద్, శ్రీకాంత్, ఆనంద్ రావు, కాంగ్రెస్ నేతలు మధుమతి, ఉమేష్, అభిషేక్ కేనడి, బిఆర్‌ఎస్ నేతలు రాకేష్, శ్రీకాంత్, స్థానిక టిఆర్టి వాసులు  పాల్గొన్నారు.