19 May, 2026 | 8:43 AM

సీటు బెల్టు ధరించి ప్రాణాలను కాపాడుకోవాలి

19-05-2026 12:00 AM

ట్రాఫిక్ సీఐ యెలగొండ కృష్ణ

యాదగిరిగుట్ట,  మే 18 : కారులో ప్రయాణం చేసే వాళ్ళు తప్పకుండా సీటు బెల్టు ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని ట్రాఫిక్ సిఐ యేలగొండ కృష్ణ అన్నారు. యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో సోమవారం  ప్రత్యేక డ్రైవ్ గా సీటు బెల్ట్ దాని ఉపయోగాలను వాహనదారులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీట్ బెల్ట్ పెట్టుకున్నట్లయితే ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవుతుందని ఫలితంగా ప్రమాద తీవ్రత నుండి బయటపడవచ్చు అని తెలియజేశారు.

లక్షలు పెట్టి కార్లు కొన్న సీటు బెల్టు ఉపయోగించుకుంటే ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అదేవిధంగా వాహనంలో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సీటు బెల్టు ధరించాలని తెలపడం జరిగిందన్నారు. ఎవరైతే సీటు బెల్టు పెట్టుకోకుండా ప్రయాణిస్తున్నారో వారికి జరిమానా కూడా విధించడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట ట్రాఫిక్ ఎస్త్స్ర  దేవేందర్, ట్రాఫిక్ సిబ్బంది  సలీం, హనుమంతు, వెన్నెల, శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.