23 April, 2026 | 3:36 AM

వారంలో పెళ్లి.. బావిలో శవమై తేలిన యువతి

23-04-2026 12:51 AM

మరిపెడ (మహబూబా బాద్) ఏప్రిల్ 22 (విజయక్రాంతి): వారం రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి అనుమానాస్పద స్థితిలో బావిలో శవమైతెలిన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని గిరిపురం శివారు ఇటుకల తండాలో బుధవారం చోటుచేసుకుంది. భూక్యా సంగీత (20) తో కొత్త తండా కు చెందిన అజ్మీరా అరవిందుతో ఈనెల 29న వివాహం జరపతలపెట్టారు. ఈ క్రమంలో అరవింద్ ఇంట్లో జరిగిన ఓ శుభకార్యానికి సంగీత బంధువులతో సహా మంగళవారం హాజరయ్యారు.

మంగళవారం రాత్రి సంగీత అరవింద్ బయటకు వెళ్లగా బుధవారం సంగీత బావిలో శవమై కనిపించడంతో కలకలం రేపింది. ఈ సంఘటనపై మరిపెడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంగీత అరవింద్ ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నారని, ఇందుకు పెద్దలు కూడా అంగీకరించారని, తీరా వారం రోజుల్లో పెళ్లి జరగాల్సిన సమయంలో సంగీత మరణం తీవ్ర విషాదాన్ని రేపింది.