calender_icon.png 14 February, 2026 | 9:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కనుల పండువగా శివపార్వతుల కళ్యాణం

14-02-2026 07:24:35 PM

కనులారా తిలకించి తరించిన భక్తజనం

పాపన్నపేట: మహాశివరాత్రిని పురస్కరించుకొని మండల కేంద్రం పాపన్నపేటలోని శివాలయంలో శనివారం శివపార్వతుల కళ్యాణం కనుల పండువగా నిర్వహించారు. ఆలయ అర్చకులు విశ్వనాథ శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచే పూజా కార్యక్రమాలు కొనసాగాయి. గణపతి పూజ, పుణ్యావచనం అనంతరం శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణ తంతును కనులారా తిలకించారు. ఆయా కార్యక్రమాల్లో గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.