పెళ్లి వాహనం బోల్తా.. ఇద్దరు మృతి
- 14 మందికి గాయాలు
నిర్మల్ జిల్లాలో ఘటన
నిర్మల్, మార్చి 12 (విజయక్రాంతి): నిర్మ ల్ మండలంలోని ఎల్లంపల్లి శివారులో హై దరాబాద్ జాతీయ రహదారిపై గురువారం పెళ్లి వాహనం బోల్తా పడి, ఇద్ద రు దుర్మరణం చెందారు. అదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం సోంపూర్ గ్రామానికి చెందిన 21 మంది మినీ వ్యాన్‌లో ఆర్మూర్‌కు పెళ్లి కోసం వెళ్తున్నారు. ఎల్లాపెల్లి వద్దకు రాగానే వాహనం ముందు టైరు పేలిపోవడంతో అదుపుతప్పి బోల్తా పడింది.
అందు లో ప్రయాణిస్తున్న భరోడే లక్ష్మణ్ (60), బోయినవాడు తులసి దాస్ (38) ఇద్దరు తీవ్రగాలయాలై అక్కడికక్కడే మృతి చెందా రు. బాలాజీ, లక్ష్మణ్ తోపాటు మరో ఇద్దరికి గాయాలు కాగా పది మందికి స్వల్ప గాయా లు అయ్యాయి. ఎస్పీ జానకి ఘటన స్థలానికి వెళ్లి క్షతగాత్రులను నిర్మల్ ప్రభుత్వ ఆసు పత్రికి తరలించారు. విషమంగా ఉన్న ఇద్దరిని ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు.




