21 లక్షల విలువ గల మొబైల్ ఫోన్లు బాధితులకు అప్పగింత
19-08-2026 08:06 PM
102 మొబైల్ ఫోన్లు
కొడిమ్యాల,(విజయ క్రాంతి): జగిత్యాల జిల్లాలో పోగొట్టుకున్న,చోరీకి గురైన 102 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ... ఫోన్ల విలువ సుమారు 21 లక్షలు ఉంటుందని, మొబైల్ పోయినా చోరీకి గురైనా సిఈఐఆర్ పోర్టల్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవాలని, సిఈఐఆర్ ప్రారంభమైనప్పటి నుంచి జిల్లాలో 2,024 మొబైల్ ఫోన్లు సుమారు 4.5 కోట్ల విలువైన ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందించినమని,సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని,మోసానికి గురైతే వెంటనే 1930కు ఫోన్ చేయాలని సూచించారు.






