విద్యార్థులకు గులాబీలతో స్వాగతం
పాపన్నపేట, జూన్15: బడి ప్రారంభం సందర్భంగా వినూత్న రీతిలో విద్యార్థులకు స్వాగతం పలికారు. పాపన్నపేట ఉన్నత పాఠశాలలో వేసవి సెలవుల అనంతరం మండల విద్యాధికారి ప్రతాప్ రెడ్డి, పాఠశాల హెచ్‌ఎం మహేశ్వర్ చేతుల మీదుగా విద్యార్థులకు గులాబీ పూలతో స్వాగతం పలుకుతూ పాఠ్యపుస్తకాలు, పెన్నులు అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్య ప్రభుత్వ బడిలోనే అందుతుందన్నారు.
విద్యావంతులైన ఉపాధ్యాయులు కేవలం ప్రభుత్వ బడిలోనే ఉంటారని, తమ విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలలకు కాకుండా ప్రభుత్వ బడులకు పంపాల్సిందిగా ఆయన తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటేశం, అంజాగౌడ్, ప్రవీణ్, భట్టు నాగరాజు, వేణుగోపాల్ రెడ్డి, మంగ నర్సింలు, యాదయ్య, మోహన్ రావ్, నింగప్ప, రియాజ్, కృష్ణ కాంత్, శ్రీహరి, ఇందిర, పద్మ, జకెరా, లక్ష్మీ, రజిత తదితరులు పాల్గొన్నారు.






