1 June, 2026 | 12:46 AM

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు

01-06-2026 12:00 AM

అలంపూర్, మే 31: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో భాగంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను శాంతినగర్ పట్టణంలోని  క్యాంపు కార్యాలయంలో  ఆదివారం నాయకులు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప  మాట్లాడుతూ ..పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వైస్ చైర్మన్ కుమార్, జిల్లా మహిళా అధ్యక్షురాలు నాగ శిరోమణి, ఇరు మండలాల అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, రుక్మానందరెడ్డి,యోగి రెడ్డి  లబ్ధిదారులు పాల్గొన్నారు.