1 June, 2026 | 12:46 AM

టీఆర్‌ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ మహోత్సవం

01-06-2026 12:02 AM

జడ్చర్ల,మే 31: పట్టణంలో జడ్చర్ల నియోజకవర్గ  తెలంగాణ రక్షణ సేన టిఆర్‌ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్చర్ల నియోజకవర్గం ఇంచార్జీలు బిర్లా ఎల్లయ్య యాదవ్ ,శాగంటి మనోహర్ గౌడ్ ఆధ్వర్యంలో జెండాను ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహబూబ్నగర్ జిల్లా జెండా పండుగ ఇన్చార్జి మెట్టు కాడి ప్రభాకర్, జడ్చర్ల నియోజకవర్గ పార్టీ అబ్జర్వర్ ప్రవీణ్ ముదిరాజ్ హాజరయ్యారు మాట్లాడుతూ టిఆర్‌ఎస్ పార్టీ ముఖ్య ఉద్దేశం తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం అన్ని వర్గాలను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం ముఖ్య ఉద్దేశం అని తెలిపారు.

కార్యక్రమం ముందు టిఆర్‌ఎస్ పార్టీలో గంగాపూర్ గ్రామానికి చెందిన అజీజ్, ఆంజనేయులు, కురుమయ్య, జగత్ తదితరులు పార్టీలోకి కండువా కప్పి నియోజకవర్గ ఇన్చార్జి లు ఆహ్వానించారు.  ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ధీరజ్ ముదిరాజ్, భగీరథ ముదిరాజు, కృష్ణారెడ్డి, మల్లేష్, జగదీశ్వర్ ముదిరాజ్, మమ్మద్ ఉస్మాన్, మహమ్మద్ అజి, శ్రీశైలం గౌడ్,  రాజేష్ తదితరులు పాల్గొన్నారు