12 May, 2026 | 11:57 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

ప్రతి గడపకూ సంక్షేమం కాంగ్రెస్ లక్ష్యం

03-05-2026 12:00 AM

రంగారెడ్డి జిల్లాలో ఉత్సాహంగా ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక

రంగారెడ్డి, మే 2(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి న ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా పండుగ వాతావరణంలో కొనసాగింది. శనివారం జిల్లాలోని పలు నియోజకవర్గ కేంద్రా ల్లో నిర్వహించిన సభలకు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

మార్చి 6 నుండి జూన్ 12 వరకు 99 రోజుల పాటు సాగే ఈ కార్యాచరణలో భాగంగా ప్రజల సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో జరిగిన ప్రజా పాలన సభల్లో ముఖ్య అతిథులుగా పాల్గొని, లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు.

కల్వకుర్తిలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, షాద్‌నగర్లో ఎమ్మె ల్యే వీర్లపల్లి శంకర్, ఇబ్రహీంపట్నంలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, చేవెళ్లలో ఎమ్మెల్యే కాలే యాదయ్య, మహేశ్వరంలో టీయూఎఫ్‌ఐడిసీ ఛైర్మన్ చల్లా నర్సింహారెడ్డి, అదనపు కలెక్టర్లు చంద్రా రెడ్డి, కిరణ్మయిలు, జడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, డీపీవో సురేష్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడు తూ ప్రజా పాలన ప్రగతి కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని... సీఎం రేవంత్ రెడ్డి పాలెం లో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు గడపగడపకు చేరుతున్నాయని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో కందుకూర్ ఆర్డీఓలు వివిధ శాఖల తహసిల్దార్లు, ఎంపీడీవోలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.