23 August, 2026 | 9:10 PM

యూరియా కొరత లేదు.... రైతులు ఆందోళన చెందొద్దు

23-08-2026 08:22 PM

ఏడీ సంధ్య రాణి 

నర్సాపూర్ ఆగస్టు 23: నర్సాపూర్ డివిజన్‌లో యూరియా కొరత లేదని వ్యవసాయ శాఖ ఏడీ సంధ్య రాణి వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. రైతులు అవసరానికి మించి యూరియాను కొనుగోలు చేసి నిల్వ చేసుకోవద్దని, అవసరమైన మేరకే ఎరువులు తీసుకోవాలని సూచించారు. ఎరువుల విక్రయాల కోసం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త యాప్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యలను చాలావరకు పరిష్కరించినట్లు తెలిపారు.

ప్రస్తుతం మండలాన్ని ఒక యూనిట్‌గా పరిగణించి రైతులు తమ మండల పరిధిలోనే ఎరువులు కొనుగోలు చేసేలా యాప్‌ను రూపొందించారు.నర్సాపూర్ డివిజన్‌లో గత ఏడాది 2,780 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయగా, ఈ ఏడాది ఆగస్టు వరకు 3,291 మెట్రిక్ టన్నులు అందజేశామని అధికారులు వెల్లడించారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరానికి అనుగుణంగా యూరియాను అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేశారు.