4 August, 2026 | 5:03 PM

జర్నలిస్టుల సంక్షేమమే టీయూడబ్ల్యూజే ప్రధాన ధ్యేయం

04-08-2026 03:23 PM

జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా

రుద్రంగి,(విజయక్రాంతి): తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ) ప్రధాన లక్ష్యం జర్నలిస్టుల హక్కుల పరిరక్షణతో పాటు వారి సంక్షేమమేనని జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా అన్నారు. అల్లం నారాయణ, సాగరన్న నాయకత్వంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం సంఘం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన టీయూడబ్ల్యూజే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని సభ్యులకు సభ్యత్వ రసీదులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు అందేలా ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.జర్నలిస్టులంతా ఐకమత్యంగా ఉండి తమ హక్కులు, సంక్షేమం కోసం సంఘటితంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

రుద్రంగి ప్రెస్ క్లబ్ బలోపేతానికి జిల్లా కమిటీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అలీ, రుద్రంగి ప్రెస్ క్లబ్ సభ్యులు గసికంటి రాజు,కత్తి రాజు,గుగ్గిళ్ల తిరుపతి,తుమ్మనపెళ్లి నరేందర్,పిసరి కిషన్, నెరేళ్ల శేఖర్, ఎల్లల నర్సారెడ్డి, లింగంపెళ్లి గంగాధర్, దెగావత్ తిరుపతి, నంద్యాడపు శ్రీనివాస్, మండలోజి ఉదయ్, సుంచు అనిల్, తర్రె మునీందర్ తదితరులు పాల్గొన్నారు.