బస్సు రాక కోసం చెట్ల కొమ్మలు తొలగింపు
04-08-2026 03:25 PM
బోథ్,(విజయక్రాంతి): సోనాల మండలం కేంద్రం నుండి ప్రతిరోజు ఆర్టీసీ అధికారులు మహాదుగూడవరకు ఆర్టీసీ బస్సును నడిపిస్తున్నారు. అయితే బస్సు నడిపిస్తున్న రూట్లో చెట్ల కొమ్మలు అడ్డుగా వస్తుండడంతో చింతల బోరి గ్రామానికి చెందిన పంచాయతీ సర్పంచ్ గైక్వాడ్ శ్రీరామ్ ఉప సర్పంచ్ డి విష్ణు, గ్రామ కార్యదర్శి శ్రీకాంత్ లు కలిసి గ్రామస్తుల సహకారంతో చెట్ల కొమ్మలు తొలగించారు. దీంతో ఆర్టీసీ బస్సు రాకపోకలకు సుబ్రమణ్యం అయింది. గ్రామస్తులు సహకారాన్ని ఆర్టిసి బస్సు డ్రైవర్ కండక్టర్లు అభినందించారు.






