4 August, 2026 | 4:22 PM

ఖానాపూర్ మున్సిపాలిటీలో మొక్కలు నాటిన అడిషనల్ కలెక్టర్

04-08-2026 03:20 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో మంగళవారం నిర్మల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వన మహోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విధిగా మొక్కలు నాటాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్, వైస్ చైర్మన్ మహమ్మద్ షోయబ్, కౌన్సిలర్ బొప్పారపు సత్యవతి, కమిషనర్ సుందర్ సింగ్, తదితరులు ఉన్నారు.