31 March, 2026 | 8:57 AM

కాంగ్రెస్ పాలనలోనే బడుగు బలహీన వర్గాల సంక్షేమం

18-02-2025 12:50 AM
  1. బీసీ జనాభా ఆధారంగా ‘స్థానిక’ ఎన్నికల్లో రిజర్వేషన్లు
  2. ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నాం..
  3. యువత నెపుణ్యాభివృద్ధి కోసమే స్కిల్ వర్సిటీ నిర్మాణం
  4. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు

పెద్దపల్లి/ మంథని/ రామగుండం, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): కాంగ్రెస్ పాల నలోనే బడుగు బలహీన వర్గాల సంక్షేమం సాధ్యమని, బీసీల జనాభాకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు సర్కార్ కట్టుబడి ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్ర మలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఉద్ఘాటించారు.

పెద్దపల్లి, రామ గుండం, మంథని నియోజకవర్గాల్లో సోమవారం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాల్లో మంత్రి మాట్లాడారు. ఓటింగ్‌లో కుల, మత భేదాలు చూపొద్దని సూచిం చారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.

అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. తమ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 55 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. యువతలో నైపుణ్యాలను మెరుగుప రిచేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో స్కిల్ యూనివర్సిటీ నిర్మిస్తున్నామని వెల్లడించారు.

317 జీవో ద్వారా ఉపాధ్యాయు లకు సొంత జిల్లాలకు బదిలీ చేసే అవకాశం కల్పించామని గుర్తుచేశారు. ఉపాధ్యాయులకు పారదర్శకంగా పదోన్నతులు ఇచ్చామ ని తెలిపారు. సమావేశాల్లో విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, ఎమ్మెల్యేలు విజయరమణారావు, మాక్కాన్ సింగ్, ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.