హిందూ సమాజ ఐక్యత అవసరం
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ భగవత్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: హిందూ సమాజ ఐక్యత చాలా అవసరం అని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. దేశంలో హిందూ సమాజమే బాధ్యతాయుతమైన సమాజం అని ఆయన కీర్తించారు. పశ్చిమబెంగాల్‌లో సోమ వారం ఆర్‌ఎస్‌ఎస్ సభలో ఆయన ప్రసంగిస్తూ ‘మేము కేవలం హిందూ సమాజం మీదే ఎం దుకు దృష్టి పెడుతున్నామని చాలా మంది ప్రజలు తరచూ అడుగుతుంటారు.
వారికి నేని చ్చే సమాధానం ఒక్కటే. దేశంలో బాధ్యతాయుతమైన సమాజం హిందూ సమాజం మాత్రమే. మన దేశానికి సహజ స్వభావం ఉంది. ఆ లక్షణాలతో ఇమడలేని కొంత మంది వేరే దేశంగా విడిపోయారు. భిన్నత్వమే ఐక్యతగా హిందువులు గ్రహించారు. ఈ రోజు స్పెషల్ ఈవెంట్ ఏమీ లేదు. తరచూ అందరూ సంఘ్‌కు ఏం కావాలని అడుగుతుంటారు.
వారందరికీ ఒకటే సమా ధానం చెబుతున్నా.. సంఘ్‌కు హిందూ సమాజం ఐక్యత కావాలి. భరత్‌వర్ష అనేది కేవలం భౌగోళిక అస్థిత్వం మాత్ర మే కాదు. ఏండ్లుగా ఈ ఖండం విస్తీర్ణం పెరగిందా? తగ్గిందా? అనేది విషయం కాదు.. భరత్‌వర్షకు ఒక ప్రత్యేకమైన స్వభావం ఉంది.
ఎన్ని ఏండ్లు అయినా అది అలాగే ఉంటుంది. ఇది నచ్చని కొంత మంది వేరే దేశంగా జీవిస్తున్నారు. మనమంతా భిన్నత్వంలో ఏక త్వం అని అంటుటాం. కానీ హిందూ సమాజం మాత్రం భిన్నత్వమే దాని ఐక్యత అని అర్థం చేసుకుంది’. మోహన్ భగవత్ అని తెలిపారు.
మహారాజులను గుర్తుంచుకోరు..
‘ఈ దేశాన్ని పాలించిన సామ్రాట్‌లు, మహారాజులను ప్రజలు గుర్తు పెట్టుకోరు. తండ్రి మాట కోసం 14 ఏండ్లు అరణ్యవాసం చేసిన రాజును, తన సోదరుడి పాదరక్షలు తీసుకుని అతడు తిరిగి రాగానే రాజ్యాన్ని ఆయనకు అప్పగించిన వాళ్లనే ప్రజలు గుర్తుపెట్టుకుంటా రు’ అని మోహన్ భగవత్ తెలిపారు.




