సంక్షేమ పథకాలు లబ్ధిదారుల హక్కు..
మధ్యదళారులను నమ్మవద్దు...
చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్...
ఆదిలాబాద్ (విజయక్రాంతి): పెళ్లి జరిగిన వెంటనే లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందిస్తే వారికి కొంత ఆర్థిక ఇబ్బంది ఉండదని, ప్రభుతం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదిలాబాద్ అర్బన్, రూరల్, మావల మండలాలకు చెందిన 191 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలలో మధ్యదళారులను నమ్మవద్దని సూచించారు. ఎవరికి ఒక రూపాయి సైతం ఇచ్చే అవసరం లేదని, సంక్షేమ పథకాల ఫలాలు పొందడం లబ్ధిదారుల హక్కు అన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు ఎంతో కష్టపడి ఆడపిల్ల పెళ్లి చేస్తారన్నారు. తాను అందరికీ ఎమ్మెల్యేనని ఓటు వేసిన వెయ్యకున్న అందరి సంక్షేమం కోసం పని చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పలువురు, కౌన్సిలర్లు, బీజేపీ నాయకులు, అధికారులు తదితరులు ఉన్నారు.






