లక్ష్య సాధన దిశగా కృషి చేయాలి
జిల్లా కోర్టు ప్రిన్సిపల్ సెషన్ జడ్జి కుంచాల సునిత
నిజామాబాద్ (విజయక్రాంతి): విద్యార్థినులు ఉన్నత లక్ష్యలతో విద్యాభ్యాసం చేసి ఉన్నత ఫలితాలు సాధించాలని నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రిన్సిపల్ సెషన్ జడ్జ్ కుంచాల సునిత విద్యార్థిలకు సూచించారు. మంగళవారం అంతార్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సంధర్భంగా నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఆమె ప్రసంగించారు. జిల్లా న్యాయ సేవ సంస్థ ఆద్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆమె ముఖ్య అథిదిగా హజరై ప్రసంగించారు. విద్యార్థినులు విద్యను అభ్యసించడం తమ హక్కు అని ఒక లక్ష్యసాధనగా ముందుకు సాగాలని విద్యను అభ్యసిస్తే అనుకున్నది సాధించవచ్చని అమె విద్యార్థినిలకు ఉద్భోదించారు. విద్యార్థి దశ నుండే క్రమశిక్షణతో ప్రతి మహిళ ఉన్నతంగా తమ జీవితాన్ని తీర్చిదిద్దుకోవలన్నారు. కష్టపడి చదవడంతో పాటు విద్యపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చలని అన్నిరంగాలల్లో మహిళలు రానించాలని సునిత ఆకాంక్షించారు.
జిల్లా న్యాయ సేవ సంస్థ కార్యదర్శి సినియర్ సివిల్ జడ్జ్ పద్మావతి మాట్లాడుతూ.. విద్యార్థి దశలోనే హక్కుల గురించి తెలుసుకోవలని అన్ని విషయాల్లో జిల్లా న్యాయ సేవ సంస్థ మహిళల హక్కుల పరిరక్షన కోసం న్యాయసేవ అందించేందుకు కృషి చేస్తుందని పద్మావతి అన్నారు. అన్యాయానికి గురైన వారికి న్యాయ సేవ సంస్థ ఉచిత న్యాయ సహాయం చేస్తుందని విద్యార్థినులకు అమె తెలిపారు. రాజ్యగం ప్రకారం ప్రతి ఒక్కరు విద్యార్థి దశ నుండే హక్కులతో పాటు విధులను చిత్త శుద్ధితో నిర్వర్తించాలని అమె అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ బుద్ది రాజు, జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమల పుడి రవికూమార్ కళాశాల విద్యార్థినులు హజరయ్యారు.






