calender_icon.png 21 November, 2025 | 11:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకు చెకుముకి

21-11-2025 11:46:07 PM

మండల విద్యాధికారి బాలునాయక్

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): పాఠశాల స్థాయిలో విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకే చెకుముకి టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు మండల విద్యాధికారి బి బాలునాయక్ అన్నారు. శుక్రవారం అర్వపల్లిలోని ఎమ్మార్సీ కార్యాలయంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు చెకుముకి టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. మండలంలోని 8 ఉన్నత పాఠశాలల విద్యార్థులు హాజరయ్యారని,ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేసినట్లు తెలిపారు.

గెలుపొందిన విద్యార్థులు త్వరలో జిల్లా స్థాయి పోటీలలో పాల్గొంటారని చెప్పారు.కార్యక్రమంలో మండల నోడల్ ఆఫీసర్ కుంభం ప్రభాకర్, జనవిజ్ఞాన వేదిక చెకుముకి కన్వీనర్లు మల్లిక, ఎబెల్ శశి, మధుకర్, ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.