5 August, 2026 | 4:22 PM

కాంగ్రెస్ ప్రజాపాలనలో సంక్షేమ పథకాలకు పెద్దపీట

03-09-2025 12:00 AM

  ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి 

అబ్దుల్లాపూర్ మెట్, సెప్టెంబర్ 2: కాంగ్రెస్ ప్రజాపాలనలో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్నామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండలం, అనాజ్ పూర్ గ్రామానికి చెందిన పోలెమోని సుగుణదర్శన్ ముదిరాజ్‌లకు ఇందిరా జల శక్తి పథకం కింద మంజూరైన “సంచార చేపల విక్రయ వాహనాన్ని” మంగళవారం ఉదయం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తెలంగాణ ప్రజా పాలనలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా... వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి,  మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్త ప్రభాకర్ గౌడ్, ఏళ్ల బాల్ రెడ్డి, ఏళ్ల నరేందర్ రెడ్డి, పాలెం శ్రీనివాస్ గౌడ్,  మండలి నరసింహ, నార్లకొండ శ్రీశైలం, గుజ్జ రాంరెడ్డి, ఏర్కలి బాలకృష్ణ గౌడ్,  పొన్నాల సురేష్  తదితరులు పాల్గొన్నారు.