5 August, 2026 | 3:18 PM

అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

03-09-2025 12:00 AM

సూర్యాపేట, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి) : సూర్యాపేట మండలం బాలెంల సమీపంలోని అరవిందాక్ష ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఐ.నీల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జువాలజీ -1, కంప్యూటర్ సైన్స్ - 1, కామర్స్ - 2 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు.

ర్హులైన మహిళా అభ్యర్థులు ఈ నెల 6 లోగా దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు. సంబంధిత సబ్జెక్టులలో పీజీలో 55శాతం మార్కులు, నెట్ లేదా సెట్, కనీసం మూడు సంవత్సరాల బోధన అనుభవం ఉండాలని తెలిపారు.ఈ నెల 8న సోమవారం ఉదయం 10 గంటల నుండి డెమోలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్స్ 9398316225, 7555010681లలో సంప్రదించాలన్నారు.