ఓటెత్తిన పశ్చిమ బంగాల్
- రెండో విడతలోనూ రికార్డుస్థాయిలో పోలింగ్ నమోదు
- సాయంత్రం 6 వరకు 92.47 శాతం పోలింగ్
స్వాతంత్య్రం నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలోనే రికార్డు
నదియా జిల్లా చాప్రలో బీజేపీ ఏజెంట్‌పై రాడ్లతో దాడి.. తలకు ఆరు కుట్లు
బీజేపీ రిగ్గింగ్‌కు పాల్పడింది: సీఎం మమతా బెనర్జీ
వద్ద భవానీపూర్ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిని చుట్టుముట్టిన టీఎంసీ మద్దతుదారులు.. స్పల్ప లాఠీచార్జి
కోల్‌కతా, ఏప్రిల్ 29: పశ్చిమ బంగాల్ ఎన్నికల్లో బుధవారం జరిగిన రెండోదశలోనూ బంగాల్ ఓటర్లు పోటెత్తారు. ఓటర్లు భారీస్థాయిలో పోలింగ్‌కేంద్రాలకు తరలొచ్చి, తమ ఓటు హక్కును వినియోగించు కుని, స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్ప టి వరకు రాష్ట్రచరిత్రలోనే రికార్డు సృష్టించారు. బుధవారం సాయంత్రం 6 గంటల వరకే 92.47 శాతం ఓటింగ్ నమోదుకావడంతో.. ఇది కదా ‘చునావ్ కా పర్వ్, పశ్చిమ బంగాల్ కా గర్వ్’ అని ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ ప్రశంసించారు. మొత్తం 294 స్థానాలకు తొలిదశలో ఈ నెల 23న 152 చోట్ల పోలింగ్ జరిగగా, దేశ చరిత్రలోనే రికార్డు స్థాయిలో 93 శాతం ఓటింగ్ నమోదైన విషయం తెలిసిందే.
మిగిలిన 142 అసెంబ్లీ స్థానాలకు రెండోదశ పోలింగ్ బుధవారం జరిగింది. ఈ ఎన్నికలు అక్కడక్కడా చెదురుముదురు సంఘటనలు మినహా అంతా ప్రశాంతంగా ముగిశాయి. నదియా జిల్లా చాప్రలో బీజేపీ ఏజెంట్‌పై టీఎంసీ మద్దతుదారులు ఇనుపరాడ్లతో దాడి చేయ గా, ఆయన తలకు ఆరు కుట్లు పడ్డాయి. భవానీపూర్ అభ్యర్థి సువేందును ఓ పోలింగ్ బూత్ వద్ద టీఎంసీ మద్దతుదారులు చుట్టుముట్టడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు స్పల్ప లాఠీచార్జి చేసి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఈ సందర్భంగా తనను అడ్డుకున్న వాళ్లు బంగ్లాదేశ్ ముస్లింలని సువేందు ఆరోపించారు. డైమండ్ హర్బర్‌లోని ఫల్తాలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని, బీజేపీ గుర్తు కన్పించకుం డా టేపు అతికించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఇక్కడ అన్ని బూత్‌ల్లో మళ్లీ పోలింగ్ నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ట్యాంపరింగ్ నిజమని తేలితే.. తిరిగి పోలింగ్ నిర్వహిస్తామని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.
మరోపక్క భవానీ పూర్‌లో బీజేపీ, టీఎంసీ తీవ్ర ఆరోపణలు చేసుకున్నాయి. బీజేపీ రిగ్గింగ్‌కు పాల్పడిందని, ఎన్నికల పరిశీలకులు ఉగ్రవాదుల్లా వ్యవహరించారని సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. అయితే మమతా బెనర్జీ బంగాల్ కంచుకోటను బీజేపీ బద్దలు కొట్టే అవకాశం ఉందని మూడు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. బంగాల్‌లో బీజేపీకే ఆధిక్యత వస్తుందని ఐదు ఎగ్జిట్ పోల్స్‌లో మూడు సర్వేలు వెల్లడించాయి. ఈ ఎన్నికల ఫితాలు మే 4న వెలువడనున్నాయి.
సువేందును చుట్టుముట్టిన టీఎంసీ మద్దతుదారులు..
బంగాల్ ప్రతిపక్ష నేత, భవానీపూర్ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఎన్నికల తీరును పరిశీలించేందుకు ఒక పోలింగ్ బూ త్ వద్దకు వెళ్లగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. టీఎంసీ మద్దతుదారులు అక్కడ కు చేరుకుని ‘జై బంగాల్’ నినాదాలు చేశా రు. కొద్దిసేపటికే వారంతా సువేందును చు ట్టుముట్టడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. దీంతో స్థానిక పోలీసులు, సీఆర్పీఎఫ్ వెంటనే జోక్యం చేసుకుని స్వల్పంగా లాఠీచార్జి జరిపి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాగా, పోలింగ్ బూత్ వద్ద తనను ముందు కు కదలకుండా చుట్టుముట్టిన వాళ్లంతా బంగ్లాదేశ్ ముస్లింలని సువేందు తెలిపారు. వాళ్లంతా భయంతో వణుకుతున్నారని, మమతా బెనర్జీ చిత్తుగా ఓడిపోవడం ఖాయమని అన్నారు.
నదియా జిల్లా చాప్రలో హింస.. బీజేపీ ఏజెంట్‌పై దాడి..
నదియా జిల్లాలోని చాష్ట్ర నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత హింసాత్మకంగా మా రింది. బుధవారం తెల్లవారుజామున సు మారు 5:30 గంటలకు, హత్రా పంచాయతీ పరిధిలోని బూత్ నెంబర్ 53 కు వెళ్తున్న బీజేపీ పోలింగ్ ఏజెంట్ మొషార్రఫ్ మీర్‌పై కొందరు దుండగులు ఇనుపరాడ్లు, కర్రలతో దాడి చేశారు. తృణమూల్ కాంగ్రె స్ (టీఎంసీ)కి చెందిన సుమారు 15 నుంచి 20 మంది వ్యక్తులు తుపాకులతో బెదిరిస్తూ తనను దారుణంగా కొట్టారని, ఈ దాడిలో తన తలకు తీవ్ర గాయాలయ్యాయని బాధితుడు ఆరోపించారు. పోలీసులు వెంటనే స్పందించి బాధితుడిని రక్షించి, చికిత్స నిమిత్తం చాప్ర గ్రామీణ ఆసుపత్రికి తరలించారు.
ఈ దాడిలో మొషార్రఫ్ మీర్ తలకు ఆరు కుట్లు పడ్డాయి. ఈ ఘటనపై బీజేపీ ఎంపీ జగన్నాథ్ సర్కార్ తీవ్రంగా స్పందించారు. చాప్ర వంటి మైనారిటీ ప్రాబల్య ప్రాంతాల్లో టీఎంసీ అండతో గూండాయిజం సాగుతోందని, తమ పార్టీ ఏజెం ట్లను బూత్‌ల్లో ఉండనివ్వకుండా భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన మండిప డ్డారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే, ఈ ఆరోపణలను టీఎంసీ నేతలు తోసిపుచ్చా రు. మరోవైపు, ఈ హింసాత్మక ఘటనల నే పథ్యంలో ఎన్నికల అధికారులు ఆ ప్రాంతం లో అదనపు బలగాలను మోహరించారు.
భవానీపూర్‌లో టీఎంసీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం
భవానీపూర్ నియోజకవర్గంలో టీఎంసీ అధినేత, సీఎం మమతాబెనర్జీ, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి మధ్య మాటల యు ద్ధం నడిసింది. ఈ ఎన్నికల్లో బీజేపీ రిగ్గింగ్‌కు పాల్పడుతోందంటూ సీఎం మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. భవానీపుర్ నియోజకవ ర్గానికి ముఖ్యమంత్రి మమతాబెనర్జీ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పోలింగ్ తీరును పరిశీలించేందుకు మమతాబెనర్జీ తాను పోటీచేస్తున్న ఈ నియోజకవర్గానికి వెళ్లా రు. ఈ సమయంలోనే బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి కూడా అక్కడికి వెళ్లారు.
ఈ క్రమంలో అక్కడే ఉన్న మమతను ఉద్దేశించి..‘ఆమెకు ఈరోజు ఎవరూ ఓటేయ రు’ అని వ్యాఖ్యానించారు. దీంతో బీజేపీ, ఎన్నికల సం ఘంపై సీఎం మమత విమర్శలు చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ రిగ్గిం గ్‌కు పాల్పడుతోందని, ఎన్నికల సంఘం పరిశీలకులు ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారంటూ దీదీ తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా, దీదీ గూండాలను వెంటేసుకొని తిరుగుతూ ఓటర్లను భయపెడుతున్నారని సువేందు కౌంటర్ ఇచ్చారు. మరోవైపు ఎన్నికల పరిశీలకుల ప్రవర్తనపై టీఎంసీ ప్రధానకార్యదర్శి అభిషేక్ బెనర్జీ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. వారు మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్నారని, రాజకీయ ఒత్తిడికిలోనే వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
92.47 శాతం పోలింగ్
పశ్చిమ బంగాల్‌లో రెండో దశ(చివరిదశ) పోలింగ్ ముగిసింది. బుధవారం 6 గంటల వరకు 92.47 శాతం ఓటింగ్ నమోదైంది. అయితే సాయంత్రం 5 గంటలలోపు పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరిన ఓటర్లకు 6 గంటల వరకు ఓటువేసే అవకాశాన్ని ఎన్నికల అధికారులు కల్పించారు. దీంతో పోలింగ్ 92.47శాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే 5 గంటల వరకు బంగాల్‌లోని ఆస్‌గ్రామ్‌లో అత్యధికంగా 94.06 శాతం పోలింగ్ నమోదైంది. 93 శాతం ఓటింగ్‌తో ద్వితయస్థానంలో హబ్రా నిలిచింది. సీఎం మమతా బెనర్జీ పోటీచేస్తున్న భవానిపూర్ నియోజకవర్గంలో 85.51 శాతం పోలింగ్ నమోదైంది. బంగాల్‌లో రెండోదశలో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైంది.
దీంతో ‘స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి పశ్చిమ బంగాల్‌లో మొదటి (92శాతం)దశ, రెండో దశ(93శాతం)లో అత్యధిక శాతం పోలింగ్ నమోదైందని, ఇది- ‘చునావ్ కా పర్వ్, పశ్చిమ బంగాల్ కా గర్వ్’(ఎన్నికలు ఒక పండుగ, పశ్చిమ బంగాల్‌కు గర్వకారణం) అని జ్ఞానేష్ కుమార్ అభివర్ణించారు. సీఎం మమతా బెనర్జీ పోటీచేస్తున్న భవానీపూర్ అత్యంత ప్రాధాన్యమైంది. బీజేపీ నుంచి సువేందు అధికారి ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.






