11 May, 2026 | 3:50 AM

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

11-05-2026 02:38 AM

కేసముద్రం, మే 10 (విజయక్రాంతి): అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. కేసముద్రం మండలం కల్వల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సిపిఎం పార్టీ మండల కమిటీ బృందం ఆదివారం సందర్శించింది. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ పది రోజుల క్రితం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినప్పటికీ, తేమ శాతం అధికంగా ఉండడంతో 8వ తారీకు నుండి బస్తాలు నింపి కంటాలు ప్రారంభించారన్నారు.

శనివారం సాయంత్రం అకాల వర్షంతో ధాన్యం నింపిన బస్తాలు తడిసిపోయాయన్నారు. తడిసిన ధాన్యానికి కాంటాలు పెట్టి మిల్లుల కు తరలించాలని, తేమపేరుతో ఎలాంటి తరుగు తీయవద్దని, కంటాలు పెట్టిన వారం లోపు రైతులకు డబ్బులు చెల్లించాలని, మద్దతూ ధర, 500బోనస్ త్వరితగతిన రైతుల ఖాతాలోకి జమ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి గోడిశాల వెంకన్న, మోడెం వెంకటేశ్వర్లు, జల్లే జయరాజ్, నీరుటి జలందర్, సుంకరి వెంకన్న, రైతులు పెద్దరపు అశోక్, ధరావత్ రవి, ఎడెల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎం.వెంకట్ రెడ్డి, సపావట్ సజ్జన్, ధరావత్ హుస్సేన్ పాల్గొన్నారు.