calender_icon.png 12 December, 2025 | 3:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భలే ఛాన్స్..!

12-12-2025 12:02:39 AM

  1. విధుల్లో అధికారులు.. ఎడ్లబండ్లతో యదాతదాం

అక్రమంగా ఇసుకను ఎడ్లబండ్లతో తరలింపు

 అతను చూసి అక్రమ ఇసుక వ్యాపారుల పంజా

చర్యలు తీసుకుంటాం: ఓబుల్ రెడ్డి, ఎస్‌ఐ, చిన్నచింత కుంట మండలం

చిన్నచింతకుంట డిసెంబర్ 10 : పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరుగు తున్న విషయం విధితమే. ఓవైపు అధికారులు పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిద్దామనే సంకల్పంతో సన్నతమవుతుంటే అక్రమ ఇసుక వ్యాపారులు మాత్రం ఇదే అదునుగా చేసుకొని ఎలాగైనా తమ వ్యాపారాన్ని తక్కువ సమయంలో మరింత పోవుచేసుకునే సంకల్పంతో ఎడ్లబండ్లతో ఇసుకను ఎత్తేసే పని పెట్టుకున్నారు.

అడ్డు అదుపు లేకుండా మండల పరిధిలోని ఒక చెట్టు వారి నుంచి అక్రమ ఇసుక తరలింపులకు పాల్పడుతూ భూగర్భ జలాలు అట్టడుగు పోయే పరిస్థితికి ప్రత్యక్షంగా కారణం అవుతూ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు.  పట్టపగలు  ఎడ్లబండ్లతో అక్రమంగా ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు అక్రమార్కులు మండలంలోని మద్దూర్  గ్రామంలో పగలు, రాత్రి అని తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఎడ్లబండ్లతో ఇసుకను తోడేస్తున్నారు. ఊక చెట్టు వాగులో నీళ్లు ఉన్న ఇసుకను తరలింపును ఆపడం లేదు.

ఎడ్లబండ్ల యజమానులు ఇసుకను మద్దూర్ నుంచి వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీకి అక్కడినుండి ఇతర గ్రామాలకు తరలిస్తున్నారు. మరియు ఇసుకను రహస్య ప్రదేశాలలో ఉంచుతూ ఆపై ట్రాక్టర్ల ద్వారా ఇతర మండలాలకు తరలిస్తూ అక్రమార్దనకు పాల్పడు తున్నారు. గ్రామాలలో ఇండ్ల నీర్మాణం, అభివృద్ధి పనులకు తహసిల్దార్ అనుమతి తీసుకొని ఇసుక తీసుకోవాలే తప్ప ఇష్టానుసారంగా ఇతర ప్రాంతాలకు అక్రమంగా ఎడ్లబండ్ల ద్వారా ఇసుకను తరలించడం చట్టరీత్య నేరమని తహసిల్దార్ ఎల్లన్న హెచ్చరించిన అక్రమ ఇసుక తరలింపుకు పాల్పడుతున్న వ్యక్తులు మాత్రం బేకతారు చేయడం విశేషం. 

మోయలేని భారంతో మూగజీవాలు

ఎడ్లబండ్ల ద్వారా ఇసుక రవాణాను జోరుగా కొనసాగిస్తున్నారు. ఎడ్లబండ్లు జాతరను తలపించేలా ఇసుక రవాణా సాగిస్తున్నారు. ఒక వైపు ఊ చెట్టు వాగు  నీటితో ప్రవహిస్తున్నప్పటికీ ఇసుకను బండ్లల్లో తీసుకొస్తూ నోరులేని మూగజీవాలను కాసుల కోసం కక్కుర్తి పడుతూ మోయలేని భారంతో జంతువులను హింసిస్తూ ఇసుక ను రవాణా సాగిస్తున్నారు. 

చర్యలు తీసుకుంటాం..

అక్రమంగా ఇసుకను తరలించే ఎడ్లబండ్లపై ప్రత్యేక దృష్టి పెట్టి పట్టుకొని కేసులు నమోదు చేస్తాం.  మండలంలో మద్దూర్ గ్రామం తో పాటు  ఇతర గ్రామాలలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారి పై  కూడా దృష్టి పెడతాం. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఇసుక ఎవరు తరలింపు చేయకూడదు.

- ఓబుల్ రెడ్డి, ఎస్‌ఐ, చిన్నచింత కుంట మండలం