22 May, 2026 | 2:04 AM

కుల గణనపై సుప్రీం కోర్టు ఏమంది?

22-05-2026 12:48 AM

బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి.చిరంజీవులు

ముషీరాబాద్, మే 21 (విజయక్రాంతి):  కుల గణనపై సుప్రీంకోర్టు  ఏమందని బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి. చిరంజీవులు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్‌లు ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం చిక్కడపల్లిలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ పొలిటికల్ ఫ్రెండ్ కన్వీనర్లు అయిన వెంకన్న గౌడ్, ఎలికట్టే విజయ్ కుమార్ గౌడ్, అంబాల నారాయణ గౌడ్, వైస్ చైర్మన్ దుర్గయ్య గౌడ్‌లతో కలిసి వారు మాట్లాడుతూ.. మే 20న సుప్రీం కోర్టు, కుల గణనను ఆపాలని కోరుతూ దాఖలైన రిట్ పిటిషన్ను కొట్టివేసిందన్నారు.

అయితే కోర్టు స్పష్టం చేసిన విషయం ఏమిటంటే, కుల గణన నిర్వహించాలా వద్దా అన్నది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయం పరిధిలోని అంశమని తెలిపిందని చెప్పారు. కోర్టు కేంద్ర ప్రభుత్వానికి కుల గణన తప్పనిసరిగా నిర్వహించాలని ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదన్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం చేసిన కుల సర్వేను ప్రత్యేకంగా ప్రశంసించలేదని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం చేసినది ‘కుల సర్వే’ మాత్రమే, కేంద్ర ప్రభుత్వం సెన్సస్ యాక్ట్-1948 ప్రకారం నిర్వహించే జనగణనకే అధికారిక చట్టబద్ధ గుర్తింపు ఉంటుందని చెప్పారు. కాబట్టి సుప్రీంకోర్టు కేంద్రాన్ని కుల గణన చేయమని ఆదేశించిందనే ప్రచారం వాస్తవాలకు విరుద్ధమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్ బైరు శేఖర్ గంగపుత్ర, జనసైన్యం రాష్ట్ర అధ్యక్షులు సింగం నాగేష్ గౌడ్ తదితరులు.