16 May, 2026 | 4:30 AM

నీకు గౌరవం ఇచ్చేదేంటి?

18-02-2025 12:00 AM

తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేయబోమని తాజాగా ఓ ప్రి రిలీజ్ ఈ వెంట్‌లో నిర్మాత ఎస్‌కేఎన్ చేసిన వ్యాఖ్యలపై హీరోయిన్ రేఖా భోజ్ స్పందించింది. ఇప్పుడేదో తెగ ఇచ్చేస్తున్నట్టు.. ప్రతివోడు ఏదో ఉద్దరించేసినట్టు వెధవ బిల్డప్పులంటూ మండిపండింది. “ఒకరకంగా తెలు గు అమ్మాయిలపై అఫీషియల్ బ్యాన్ విధించినట్టే.

మా బతుకుదెరువు మీద కొట్టేలా మాట్లాడాక నీకు గౌరవం ఇచ్చేదేంటి?” అంటూ రేఖా భోజ్ మండిపడింది. వాస్తవానికి ఎస్‌కేఎన్ ‘బేబి’ చిత్రంలో తెలుగు అమ్మాయికి హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు. ఆ సినిమా సక్సెస్ అవడానికి హీరోయిన్ వైష్ణవి చైతన్య ప్రధాన కారణం.

అయితే తెలుగు అమ్మాయిల్ని ఎంకరేజ్ చేస్తే ఏం జరుగుతుందో తనకు తెలిసొచ్చిందని.. ఇకపై తెలుగమ్మాయిలను ఎంకరేజ్ చేసేది లేదని ఎస్‌కేఎన్ స్పష్టం చేశారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.