calender_icon.png 16 December, 2025 | 12:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భలే గిరాకీ..!

16-12-2025 01:59:47 AM

పదవులు రాగానే పార్టీలు మారిన సర్పంచ్, వార్డ్ మెంబర్లు

సిద్దిపేట, డిసెంబర్ 15 (విజయక్రాంతి): ఎప్పుడెప్పుడు అని ఎదురుచూసిన పంచాయతీ ఎన్నికలు రెండు విడతలు ముగిసా యి. సర్పంచ్, వార్డు సభ్యులుగా ఎంపికైన వారికి బలే డిమాండ్ పలుకుతోంది. రెబల్, స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన వారికి కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలు రెడ్ కార్పెట్ పరి చి ఆహ్వానిస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థి అం టూ కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీల నేతలు సో షల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. లక్షల రూపాయలు వెచ్చించి గెలిచిన అభ్యర్థులకు ఏ పార్టీ వైపు వెళ్లాలో తెలియని అయోమయంలో ఉన్నారు.

సిద్దిపేట జిల్లాలోని గజ్వే ల్, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గంలో గెలిచిన స్వతంత్ర, రెబల్ అభ్యర్థులకు కాంగ్రె స్, బిఆర్‌ఎస్ పార్టీల ఆది నాయకులు వలవేస్తున్నారు. కొన్ని గ్రామాలలో బి.ఆర్.ఎస్ పార్టీ రెబల్ అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ నా యకులు ప్రత్యక్షంగా మద్దతు తెలిపి గెలుపుకు కృషి చేశారు.

మరికొన్ని గ్రామాలలో తాను ఏ పార్టీ నాయకున్ని కాదు స్వతంత్ర అభ్యర్థిని అంటూ ప్రకటించుకొని అన్ని పార్టీల మద్దతు కూడగట్టుకొని గెలుపొందా రు. గెలిచే వరకు బాగానే ఉన్న పరిస్థితి ఫలితాలు వెళ్లడయ్యాక పార్టీల నుంచి వస్తున్న వత్తిడీలను భరించలేక అన్ని పార్టీల ఆది నాయకులను కలుస్తూ అభినందనలు పొం దుతున్నారు. 

అదే అవకాశాన్ని అదునుగా చేసుకొని ఆ పార్టీ కండువాలు కప్పి మామ అనిపిస్తున్నారు. దాంతో ప్రజాప్రతినిధులకు తలనొప్పిగా మారింది. 

సర్పంచ్ ఇంటి ముందు ధర్నా..

సిద్దిపేట అర్బన్ మండలం భక్రిచేప్యాల గ్రామ సర్పంచ్ గా గెలిచిన అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కండువా కప్పి వారి జాబితాలో జత చేసుకున్నారు. అదే రోజు రాత్రికి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావును కలవగా ఆయన కండువా కప్పి శుభాకాంక్షలు తెలిపి ఆ సర్పంచ్ పదవి బీ ఆర్ ఎస్ పార్టీ ఖాతాలో వేసుకున్నారు. దాంతో కాం గ్రెస్ పార్టీ నాయకులు సర్పంచ్ ఇంటి ముం దు ధర్నా చేశారు.

ఇది ఒక ఉదాహరణగా మాత్రమే అనుకోవచ్చు కానీ దాదాపు చా లా గ్రామాలలో సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపొందిన స్వతంత్ర, రెబల్స్ అభ్యర్థులకు తమ పార్టీలోకి రావాలంటూ, తమ పార్టీ అ భ్యర్థి అంటూ ఇలా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం వారికి డిమాండ్ పలుకుతుందని తెలుస్తోంది. మరి కొన్ని గ్రామా లలో సర్పంచ్ ఏ పార్టీ అభ్యర్థి అయితే వార్డు సభ్యులుఆ పార్టీలో చేరేందుకు పావులకు కదుపుతున్నారు. సిద్ధిపేట రూరల్ మండలంలోని ఓ గ్రామంలో బి ఆర్ ఎస్ పార్టీ అభ్య ర్థులుగా గెలిచి కాంగ్రెస్ పార్టీ కండువాలు వేసుకొని ఉపసర్పంచ్ కు మద్దతు తెలిపినట్లు తెలిసింది. 

బిఆర్‌ఎస్ పార్టీ ... 

సిద్దిపేట జిల్లాలో బిఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం వల్ల కొన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరిచి పార్టీకి ఊతం పోస్తున్నారు. అదే అదునుగా చూసుకొని రెబల్స్, స్వతంత్ర అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసుకునేందుకు పార్టీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.