27 July, 2026 | 12:04 PM

Breaking News

లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •   జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి   •   బావుసాయిపేట ఇసుక క్వారీ వద్ద రైతుల ఆందోళన   •   దూడను తిన్న చిరుత పులి   •   సోనాల పాఠశాల విద్యార్థులకు శుద్ధ జలం   •   సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై అంజయ్య   •   సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: చాగంటి కోటేశ్వర రావు   •   మోదీ హామీ ఏమైంది? విద్యార్థులపై కేసులు ఎత్తివేయలేదు   •  

బదిలీపై వెళ్లిన పంచాయతీ కార్యదర్శికి సన్మానం

09-06-2026 01:39 AM

నాగిరెడ్డిపేట్,జూన్ 8(విజయ క్రాంతి):మండలములోని బంజారా తండా గ్రామపంచాయతీ కార్యదర్శిగా మమత గత ఏడు సంవత్సరాలు విధులు నిర్వహించి బదిలీపై ఎల్లారెడ్డి మండలానికి తరలి వెళ్లడం జరిగింది.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సురేష్,మాజీ సర్పంచ్ అరుణ లిబియా  నాయక్,గ్రామస్తులతో కలిసి ఆమెకు శాలువతో ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ...బంజర తండ గ్రామ కార్యదర్శిగా మమత సేవలు మరువలేనివని  గ్రామంలో ఒక వ్యక్తిగా స్నేహ పూర్వితంగా మమేకమై,ఎన్నో అభివృద్ధి పనులకు సహకరించి శ్రీకారం చుట్టారన్నారు.

కార్యదర్శి మమత ఎక్కడ విధులు నిర్వహించిన బంజర తండా గ్రామంలో ఏ విధంగా పనిచేశారో అలాగే పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని కొనియాడారు.మాజీ సర్పంచ్ అరుణ లింబో నాయక్ జ్ఞాపికను అందజేశారు.అలాగే గ్రామానికి నూతనంగా వచ్చినటువంటి కార్యదర్శి సుజాతను కూడా సన్మానించారు.ఈ గ్రామ సర్పంచ్ సురేష్ మాజీ సర్పంచ్ అరుణ లిబియా నాయక్,వార్డ్ మెంబర్లు గ్రామస్తులు పాల్గొన్నారు.