కొరియన్ ఆత్మ ఆవహిస్తే..?
వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ ఎంటర్ టైనర్ ‘కొరియన్ కనకరాజు’. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ పోస్ట్ -ప్రొడక్షన్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. తాజాగా సోమవారం రెబెల్ స్టార్ ప్రభాస్ ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు.
అల్లరి చిల్లరగా తిరిగే కనకరాజు జీవితం ఓ కొరియన్ అమ్మాయిని ప్రేమించిన తర్వాత ఊహిం చని మలుపు తిరగడం.. అదే సమయంలో కొరి యా నుంచి ఓ రహస్యమైన పాత్రతోపాటు అతీంద్రియ శక్తులు రావడం.. ఆ కొరియన్ ఆత్మ కనక రాజును ఆవహించడం వంటి కామెడీ, యాక్షన్, హారర్, ఫాంటసీ అంశాలతో సాగే కథ ఇది అని టీజర్ చూస్తే తెలుస్తుంది.
రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సత్య ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంగీతం: థమన్; డీవోపీ: మనోజ్ రెడ్డి; ఎడిటర్: సత్య జీ; ఆర్ట్: ఏ పన్నీర్ సెల్వం; నిర్మాతలు: రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి; రచన, దర్శకత్వం: మేర్లపాక గాంధీ.






