28 August, 2026 | 9:10 PM

మా ఇంటి బంగారం కలెక్షన్స్: రూ.100 కోట్ల క్లబ్‌లో సమంత సినిమా.. తెలుగు మహిళా ప్రధాన చిత్రాల్లో కొత్త రికార్డు

14-07-2026 12:00 AM
Question         Answer
Movieమా ఇంటి బంగారం
Heroineసమంత
Collectionsరూ.100 కోట్లకు పైగా
Directorబీవీ నందిని రెడ్డి
Languagesతెలుగు, తమిళం
MilestoneHighest Grossing Women Centric Telugu Film


ఇటీవల సమంత ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఫ్యామిలీ డ్రా మా ‘మా ఇంటి బంగారం’ విడుదల విశేషంగా ప్రేక్షకాదరణ దక్కించుకున్న సం గతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద అధికారికంగా రూ.100 కోట్ల మార్క్‌ను దా టింది. తద్వారా భారతీయ సినిమా చరిత్రలోనే రూ పొందిన మహిళా ప్రధాన చిత్రాల్లో అతిపెద్ద కమర్షియల్ విజయాల్లో ఒకటిగా తన స్థానాన్ని మరింత బలపరచుకుంది. ఈ చిత్రం తన బడ్జెట్‌పై 300 శాతం పైగా రికవరీ సాధించడం విశేషం.

తెలుగులో ఇప్పటివరకు వచ్చిన మహిళా ప్రధాన సినిమాల్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఇది నిలిచింది. మహిళా ప్రధాన సినిమాల్లోనే 2.5 మిలియన్స్ డాలర్స్ కలెక్షన్స్‌తో అత్యధిక ఓవర్సీస్ వసూళ్లు సాధించిన చిత్రంగానూ నిలిచింది. అంతేకాకుండా భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన సోలో మహిళా ప్రధాన చిత్రాల్లో మా ఇంటి బంగారం 6వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలైంది.

సమంత ప్రధాన పాత్రలో నటించగా, గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, గౌతమి, శ్రీముఖి, ఆనంద్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు వసంత్ మారింగంటి, రాజ్ కే నిడిమోరు కథను అందించగా..  బీవీ నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. రాజ్, సమంత, హిమాంక్ కలిసి ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. 

మా ఇంటి బంగారం కలెక్షన్స్ రూ.100 కోట్ల మార్క్ దాటడం సమంత కెరీర్‌లో మరో పెద్ద విజయంగా నిలిచింది. మహిళా ప్రధాన కథలకు కూడా భారీ మార్కెట్ ఉందని మరోసారి ఈ సినిమా నిరూపించింది. రానున్న రోజుల్లో ఈ చిత్రం మరిన్ని బాక్సాఫీస్ రికార్డులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మా ఇంటి బంగారం కలెక్షన్స్ ఎంత?


సమంత నటించిన 'మా ఇంటి బంగారం' సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. తెలుగు మహిళా ప్రధాన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

RELATED ARTICLES......