26 August, 2026 | 12:00 PM

సీఎం పదవి కన్నా పెద్ద స్టేచర్ ఏముంది?

14-03-2025 01:46 AM

బీఆర్‌ఎస్ నాయకులపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆగ్రహం

హైదరాబాద్, మార్చి 13 (విజయక్రాంతి): సీఎం పదవి నిర్వహించే స్టేచర్ గురించి కేటీఆర్ సభ దృష్టికి తీసుకొచ్చారని, రేవంత్ స్టేచర్ ఏంట ని మాట్లాడుతున్నారని.. సీఎం కంటే పెద్ద పదవి ఏముంటుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు.

గురువారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. స్టేచర్ అనే ది ప్రజలు ఇవ్వాలని.. అది రేవంత్‌రెడ్డికి ఏనాడో ప్రజలు ఇచ్చారని, అం దుకే తాము ప్రభుత్వంలో ఉన్నామ ని, బీఆర్‌ఎస్ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నారని చెప్పారు.

బీఆర్‌ఎస్ పదేళ్లు విధ్వంసకర పాలన చేసిందని, కమీషన్లు అంటేనే కల్వకుంట్ల కుటుంబమని, ప్రవేశపెట్టిన అన్ని పథకాల్లో కమీషన్లు దండుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభు త్వం రాష్ట్రాన్ని అవినీతి, అక్రమాల్లో నెంబర్‌వన్‌గా నిలిపిందని, కానీ తమ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమా ల్లో తెలంగాణను నెంబర్‌వన్‌గా నిలిపిందని చెప్పారు.