విద్యుత్ చోరీకి పాల్పడితే కఠిన చర్యలు డీపీ స్క్వాడ్ డీఈస్వామి
14-03-2025 01:46 AM
హుజూర్ నగర్, మార్చి 13: హుజూర్ నగర్ లో విద్యుత్ వినియోగదారులు విద్యుత్ చోరీకి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని డీపీ స్క్వాడ్ డి ఈ స్వామి అన్నారు.గురువారం డీపీ స్క్వాడ్ డీ.ఈ స్వామి సూర్యాపేట జిల్లా విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా హుజూర్నగర్, గోపాలపురం గ్రామంలలో ఇటుక బట్టిలలో వినియోగించే విద్యుత్ వినియోగంపై తనిఖీలు నిర్వహించారు.
అనంతరం స్వామి మాట్లాడుతూ విద్యుత్ వినియోగంపై నిర్వహకులకు పలు సూచనలు చేశారు. విద్యుత్ చోరికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో విజిలెన్స్ సిబ్బంది ఉపేందర్,కరెంట్ లైన్ ఇన్స్పెక్టర్ బ్రహ్మం, ఏల్‌ఏం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.






