మార్గదర్శకులుగా ఎస్సై
పెన్ పహాడ్, మార్చి 13 : చేతికి వచ్చిన కొడుకు కుటుంబానికి ఆదెరువుగా ఉంటాడనుకున్న తల్లిదండ్రులు ఆ కొడుకే చిత్ర హింసలు పెట్టగా ఆ కుటుంబానికి స్థానిక ఎస్సై బాసటగా నిలిచారు. తట్టుకోలేని తల్లిదండ్రులు ఎట్టకేలకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ హృదయ విధారక ఘటన సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం భక్తుళాపురంలో చోటుచేసుకుంది.. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ యువకుడు గత కొన్ని ఏళ్లుగా తాగుడుకు బానిస అయ్యాడు. ఈ క్రమంలో భర్త ప్రవర్తన భరించలేక భార్య తల్లిగారింటికి వెళ్లిపోయింది. కాటికి దగ్గరేనా తన తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత యువకుడిపై ఉన్నా.
అనేక సందర్భాల్లో తల్లిదండ్రులను హింసించే వాడని, గ్రామంలో పెద్దలకు చెప్పినప్పటికీ వినిపించుకోకపోవడంతో ఎట్టకేల కు పెన్ పహాడ్ ఎస్‌ఐ గోపికృష్ణకు ఫిర్యాదు చేశారు. ఎస్త్స్ర ఆ యువకున్ని పిలిపించి మానసిక ఆరోగ్యం.. తల్లిదండ్రుల ఆరోగ్య భద్రత, సమాజంలో వ్యక్తి ప్రాధాన్యత పై వారం రోజులపాటు కౌన్సెలింగ్ ఇచ్చాడు.
తన జీవన విధానాన్ని మార్చుకుంటానని చేతులెత్తి నమస్కరించిన ఆ యువకుడు తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి కాలపై పడి.. విలపించి ఏనాడు ఏ తప్పు చేయనని.. తమరి ఆరోగ్యం.. కుటుంబ పోషణ విషయంలో లోటు రానీయనని ప్రమాణం చేసి తన తల్లిదండ్రులను అక్కున చేర్చుకున్నాడు. దీంతో ఆ కుటుంబ రోధన గ్రామస్తులను కంటతడి పెట్టించింది. సమాజంలో ఇలాంటి పరిస్థితి దాపురించిన ప్రతి కుటుంబానికి ఈ హృదయ విదారక ఘటన చూసి మారాలని కోరుకుంటున్నారు.






