calender_icon.png 15 July, 2025 | 10:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల్లో పారిశుద్ధ్యంపై పట్టింపు ఏది?

15-07-2025 12:00:00 AM

అయిజ జులై 14.గ్రామాలలో అధికారులు ఎవరు పట్టించుకోకపోవడంతో పారి శుద్ధం పూర్తిగా పడకేసిందని జిల్లా మాజీ బీజేపీ అధ్యక్షులు రామచందర్ రెడ్డి ఆరోపించారు. సోమవారం మండలం లోని టిటి దొ డ్డి గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి ఆయన పర్యటించారు.

ఈ సందర్బంగా అ యన మాట్లాడుతూ గ్రామంలో ఎక్కడ చూ సిన పారిశుద్ధం లోపించిందన్నారు. గ్రా మాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారం కావాలంటే తెలంగాణ రాష్ట్రంలో వెంటనే స్థానిక ఎన్నికలు జరిపినట్లయితే పల్లెలు అభివృద్ధి జరిగి పరిశుభ్రంగా ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలో బలిగెర శివారెడ్డి,గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగినది.