calender_icon.png 15 July, 2025 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అగర్వాల్ కంటి హాస్పిటల్ లో ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సౌకర్యం

14-07-2025 11:11:33 PM

హనుమకొండ బిజినెస్ మేనేజర్ న్యాతకాని లక్ష్మీనారాయణ..

హనుమకొండ (విజయక్రాంతి): గ్రేటర్ వరంగల్ హనుమకొండ ప్రాంతం 59 డివిజన్ భవానినగర్ కాలనీ కమ్యూనిటీ హల్ లో ఆదివారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వరంగల్, భవానినగర్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో సుబేదారిలోని డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి(Dr. Agarwal's Eye Hospital) ఆధ్వర్యంలో 200 మందికి పైగా రోగులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి, వందమందికి ఉచితంగా కళ్ళ జోళ్ళు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బిజినెస్ మేనేజర్ న్యాతగాని లక్ష్మి నారాయణ మాట్లాడుతూ.. మా హాస్పిటల్ లో కంటి చూపుతో బాధపడే వారికి ఆరోగ్య శ్రీ, ఈహెచ్ఎస్ సౌకర్యంతో అన్ని రకాల కంటి ఆపరేషన్లు చేస్తున్నామని అన్నారు. ఈ అవకాశాన్ని కంటి వ్యాధితో బాధపడుతున్న వారంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డాక్టర్ ప్రసన్న కుమార్, అప్తామెట్రిస్ట్ లు హరి క్రిష్ణ శైలజ, యోగిని, రమేష్ పాల్గొన్నారు.