14-07-2025 11:14:40 PM
పరారీలో పలువురు..
10 మందిపై కేసు నమోదు..
ఇల్లందు (విజయక్రాంతి): ఇల్లందు పట్టణంలోని స్టేషన్ బస్తీ సమీపంలో కొందరు పేకాటరాయుళ్లు పేకాట ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి(SI Srinivas Reddy) తన సిబ్బందితో పేకాట స్థావరంపై సోమవారం దాడి చేశారు. పదిమందిలో ముగ్గురిని పట్టుకున్నారు. మిగతావారు పరార్ లో ఉన్నారు. గుగులోతు రమేష్, రఘువర్మ, చలపతి ఉపేందర్ లను అరెస్టు చేశారు. పది మందిపై కేసు నమోదు, మూడు సెల్ ఫోన్లు నగదు రూ 4,150 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.