25 February, 2026 | 2:02 AM

జలాల పంపిణీలో మాకు పరిష్కారమే ముఖ్యం

25-02-2026 12:24 AM

సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ 

హైదరాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి) : తెలుగు రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా నెలకొన్న కృష్ణా, గోదావరి జలాల పంపిణీ ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి. జల సాధనలో ఘర్షణల కంటే చర్చల ద్వారానే శాశ్వత పరిష్కారాలు సాధ్యమని, ప్రజా ప్రయోజనాలే పరమావధిగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని పలువురు మేధావులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు.

‘దేవాదుల సాక్షిగా కృష్ణా, గోదావరి జలాల సాధనలో వివాదామా..? పరిష్కారమా..? అంటే తాము పరిష్కారం కోరుకుంటాం. చర్చలా..? పంచాయితీనా అంటే మేం చర్చలే కోరుకుంటాం’ అని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి పౌరుడికి తాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరు అందివ్వడమే తమ ప్రభుత్వం ముందున్న టార్గెట్ అని సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు.